Saturday, December 3, 2011

ఎక్కువ

అనామికగా నన్ను వదిలేసాడు
ఆయనొక గొప్ప మాయగాడు
ఆటలాడడం ఆయనకు చాలా సరదా
మభ్యపెట్టడం మరింత సరదా
దోబూచులాడడం ఆయనకు అలవాటె.
ఒకరిని కలపాలంటేమరొకరిని తీసేయాల్సిందే.
అలా తీసేస్తాడనీ, నమ్మించి మోసం చేస్తాడని తెలియలేదు.
నేనేదో గొప్పవాడిననే భావన నా నేస్తానికి కల్పించి,
నాకున్నదంతా ఒట్టి అజ్ఞానమని అనిపించడానికి
ఆయన ఎంత పన్నాగం పన్నాడో.
తానే నా సర్వస్వమని తనతో చెప్పించి
తనకు మాత్రం నేనేమీ కానని చెప్పాడు.
సత్యం వేరే ఉందని నమ్మబలికాడు
నాకు ప్రేమించడం చేతకాదని ఋజువు చేశాడు.
ఆయన ప్రేమలాగా నా ప్రేమ గొప్పది కాదని
నేనొట్టి మనిషినేనని నా నేస్తానికి నన్ను దూరం చేస్తున్నాడు.
ఎందుకో తెలుసా?
నా నేస్తమంటే నాకు ఆయన కన్నా ఎక్కువని భావించానని.

3 comments:

  1. ఎక్కువా కవిత బాగుంది.. సుమిత్ర గారు.. ఇది కవితలా లేదు జరిగిన కథల ఉంది ఇలానే నా స్నేహితునికి జరిగింది తనుప్రేమిచే అమ్మాయి అందరికి కంటే తననే ఎక్కువ ఇష్ట పాడాలి అని కోరుకోవటం లో తప్పు లేదు అని నా అభిప్రాయం.. అతనికి అర్ధం అయేలా చెప్పక పొతే మనతప్పు.. చెప్పిన అర్ధం చేసుకోలేక పొతే అతని తప్పు ...

    ReplyDelete
  2. telugu patalu garu,
    thank you for your hearty comment.

    ReplyDelete
  3. వినాయకచవితి శుభాకాంక్షలండి,

    ReplyDelete