
గత జన్మల అనుబంధాలు గుర్తుకు వచ్చేలా
ఈ జన్మలో నీవే సర్వస్వమన్నట్లు జీవించే
నా చూపులు నిన్ను చేరలేకపోతుంటే,
నా మాటలు నీ చెవిని సోకలేకపోతుంటే,
నా అడుగులు ఏవో పాశాలచే బంధించ బడుతుంటే,
నా భావాలు నాలోనే మ్రగ్గి పోతుంటే...
ఒక్కొక్క సారి. ఒక్కొక్కటి.. ఒక్కొక్కలా...
ఒక్కొక్క మాట. ఒక్కొక్కచూపు.. ఒక్కొక్క అడుగు...
ఒకటొకటిగా అన్నీ ఒకటిగా చేరి
నీ హృదయాన్ని నాకు దూరం చేస్తుంటే...
నా చూపులు చూపు కోల్పోయి,
నా పిలుపు నిశ్శబ్ద శబ్దంగామారి,
నా అడుగులో గమనం లేని అగమ్య చలనంతో
నా ఊహలు నిర్జీవ భావాలుగా మారిపోతే...
నా చైతన్యం అచేతనంగా మారి
అంతమేలేని అనంతజీవన పయనాన్ని అంతంచేస్తుంటే...
నేస్తమా! నీ దరికి చేరే భాగ్యాన్ని కోల్పోయి
జీవనలక్ష్యాల వైపు పయనించలేని
సుదూర బాటసారిగా మిగిలిపోతాను.
చాలా బాగుంది sumitra gaaru, chala baagaa rastunnaru..... superb.
ReplyDeleteమంచి భావుకత. మీ కవితలు చూస్తుంటే మీరెవరినో మిస్సయ్యారెమొ అనిపిస్తోంది.
ReplyDeleteచాల బాగ రాస్తున్నారు.లాస్ట్ లో టచింగ్ ఇచ్చారు....keep going:-)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteu really had an immense depth in ur feelings mavayya
ReplyDeleteexpressions are best to share than to express anipinchetu ga undi ne kavita