Thursday, June 17, 2010

గమ్యం


"యు ఆర్ అటేన్షన్ ప్లీజ్..." అంటూ
రైలు రాకను తెలియజేసే అనౌన్స్మెంట్లా,
సృష్టిలో తన రాకకు సమయమాసన్నమైందని
తల్లికి పురిటి నొప్పులు కలుగజేస్తుంది బిడ్డ.

తన ప్రయాణ ఆరంభంలో కూత కూసే రైలులా
కేర్...కేర్...అంటూ ఆరంభిస్తుంది,జీవి తన జీవన ప్రయాణాన్ని.
మార్గమధ్యంలో వచ్చే స్టేషనులన్నీ జీవిత విభిన్న దశలేసుమా!

ముందుకు సాగే రైలు విడిచిపెట్టే స్టేషన్స్లా
గడచిన జీవనదశలు వగచినా వెనుదిరిగిరావు.
సమయానికి చేరకుంటే మిస్సయ్యే రైలుబండి
అప్రమత్తత లేకుంటే లాసయ్యే సదవకాశాలకు నిదర్శనం సుమండీ!

జనసందోహంతో క్రిక్కిరిసిన ట్రైనూ,
సమస్యల వలయంలో చిక్కుకున్న బ్రెయిను...
కాలాంతరాలలో ఖాళీ అవకమానవు,
హృదయాంతరాలలో ప్రశాంతత దొరకక మానదు.

పగటి వెలుగు రేఖలలో,నిశిరాతిరి చీకటిలో, పచ్చని పైరు పొలాలలో,వెచ్చని రాతి సీమలలో,
మంచు దొంతరలలో, మండుటెండలలో,ముసురువానలలో,
పల్లెపల్లెలలో,పట్టణాలలో_ఎంతటి దూరమైనా,మరెంత భారమైనా
నిలకడగా పయనాన్ని సాగిస్తుంది, అలవోకగా నీ గమ్యాన్ని చేరుస్తుంది.

రైలు ప్రయాణంలో కలిసే సాటి ప్రయాణీకుల్లా
జీవన ప్రయాణంలో మసలే హితులూ, స్నేహితులూ,
ఎవరి గమ్యాలను వారు చేరుకుంటూ ఉంటారు.
చివరివరకూ నీకు తోడెవరు ఉంటారు?
మనందర్నీ పట్టించుకునే రైలుబండి గార్డులాగ.,మనమెవరూ పట్టించుకోని పవర్ఫుల్ గాడ్ తప్ప.

ఇంజను డ్రైవరులా నీ మనస్సు పనిచేస్తే
ఎర్ర, పచ్చ జెండాలు, దారిలోన సిగ్నల్స్లా
అంతరాత్మ ఎల్లప్పుడూ హెచ్చరికలు చేస్తుంది.
బుద్ధిగ మెలిగావంటే కష్టాలకు దూరమవుతావ్... కాదని సాగావంటే కాలగర్భంలో కలసిపోతావ్.

పేదరికంతో పోల్చే పాసింజరు బండీ, పెద్దరికం ఫీలయ్యే ఫాస్టింజను బండీ ...
చేరుకునే సమయాలలో వెనక ముందులైనా
అవి చేరకమానలేని చిట్ట చివరి గమ్యమొకటే.

అదేరీతి మనజీవన గతులు మాత్రం వేరైనా
మతాలు ఘోషించినట్లు మన జీవనగమ్యమొక్కటే,
ధూమశకట మార్గంలో సమాంతరంగా సాగిపోవు నిశ్చల పట్టాలవోలె..
మనజీవన మార్గంలో ఏనాడూ, ఏ చోటా కలిసిపోనీ, కలుపలేని
ఐహిక మొకవైపు, ఆధ్యాత్మికమొకవైపు . . .
ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకున్నా, ముప్పు నీకు తప్పాదురా, ముందు బ్రతుకు శూన్యమురా.

పయనించే పదిక్షణాలు పరిస్థితులతో సర్దుకుంటే
ఆది రైలు ప్రయాణమైనా, మన జీవన యానమైనా
పొగలు గ్రక్కే కమ్మని కాఫీలా, సాగక మానదు సాఫీగా.

అందుకే నేనంటాను . . .
మానవ సృష్టిలోని ఈ రైలు ప్రయాణం.. భగవంతుడు సృష్టించిన మన జీవనయానం.

12 comments:

  1. కొంచెం పెద్దదిగా ఉన్నా చాలా బాగా వ్రాశారు . కొన్ని వరసలు అద్భుతం

    ReplyDelete
  2. బాగారాసారండి!

    ReplyDelete
  3. chala baga chepparu, nijame namDi....

    ReplyDelete
  4. @ శివ చెరువు గారు,
    @ రాంబాబు గారు,
    @ పద్మార్పిత గారు,
    @ హను గారు,

    మీ అభినందనలకు నా ధన్యవాదములు.

    ReplyDelete
  5. పయనించే పదిక్షణాలు పరిస్థితులతో సర్దుకుంటే
    ఆది రైలు ప్రయాణమైనా, మన జీవన యానమైనా
    పొగలు గ్రక్కే కమ్మని కాఫీలా, సాగక మానదు సాఫీగా
    నాకు బాగ నచ్చింది.

    ReplyDelete
  6. ashok papayi garu,
    na blog loki meku coffee to swagatam palikinatle. coffee bagundannanduku dhanyavadamulu.

    ReplyDelete
  7. kamalji,
    meku na blog loki hrudayapurvaka swagatam. migilinavi kuda chuse prayatnam cheyandi, nachitene suma!

    ReplyDelete
  8. సుమిత్ర గారు,మీ బ్లాగును మొదటిసారిచూశాను.
    "యశోదకృష్ణ" ఫోటో అద్భుతం.

    మీరు 'గమ్యం'ని చాలా చక్కగా నిర్దేశించారు...

    ReplyDelete
  9. చాల బాగుందండీ మీ interpretation!

    ReplyDelete
  10. sai garu, pranav anuvolu garu,

    meku na dhanyavadalu cheppe mundu tappaka cheppukovalasina mata "kshantavyudanu". Alasyamga meku rply ichchinanduku.

    ReplyDelete