Wednesday, June 2, 2010

ఆమె

ఆమె ఎవరో ఎలాంటిదో మీకెవరికీ తెలియదు.
నన్ను కని, పెంచి పెద్ద చేసిన అమ్మ ఒడిలోని చల్లదనం,
పెద్దవాడినయ్యేందుకు తండ్రి, గురువులందించిన జ్ఞానం ఇచ్చిన వెలుగు,

నాలో నేను పెంచుకున్న మమతానురాగాల మల్లె పందిరి,
జీవితంలో ఎదురైన సంఘటనలు పెంచిన మనోధైర్యం,
అవగాహన పెంచే అద్భుత సంభాషణా మాధుర్యం,

మాయని మధుర భావాలను మురిపిస్తూ రమింపచేసే హృదయస్పందన,
నాలో గల ఆరిషడ్వర్గాలను మటుమాయం చేసే చిరునవ్వు,
ప్రకృతి ఆస్వాదించమని అందించిన ఈ సౌందర్యానికి ఉపాసనా మూర్తి,

ఎదలో పొంగే వేదనాశృవులను తుడిచే అమృత హస్తం,
ఎప్పటికైనా అక్కడికే చేరాలనిపించే గమ్యం,
ఈ సృష్టిలో నన్ను నన్నుగా ప్రేమించే నాదైన ఏకైక స్వరూపం,

అన్నింటినీ మించి నన్ను చూస్తూనే మురిసి తరించిపోయే
మధురమైన భావన .
నేనే సర్వస్వమని తలంచి తపించే హృదయం.

ఆనందానికి ప్రతిరూపం... భగవంతుడిచ్చిన ఆమె రూపం...
అందుకే ఆమె నాకు అంతటి అపురూపం ...

9 comments:

  1. ఆమె రూపం అపురూపం.
    ఆమె భావన ఆనందానికి ప్రతిరూపం.
    మీరన్నది నిజం.

    ReplyDelete
  2. కధలు గాధలు రాసేసి,కవనమల్లి
    తెలుగు రచయిత్రి వయ్యేవు, వెలుగు నిండె,
    తెలుగు కధలకు ఎందుకు తలుపు వేసి
    అనుమతించవు? నాతల్లి! అర్ధ మేమి?

    టేకుమళ్ళ వెంకటప్పయ్య.
    tekumalla.venkatappaiah@gmail.com

    ReplyDelete
  3. @ పద్మార్పితా గారు: ధన్యవాదములండీ.
    మొదటిసారి మీ బ్లాగును చూశాను. చాలా బాగుంది.
    నా బ్లాగుని ఇంకా శోధించినట్లు లేదు.

    @ అక్షరమోహనం గారు: చాలా థాంక్సండి.

    @ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు: మీకు నిరాశ కలిగించినందుకు క్షంతవ్యుడను. సమయాభావము వలన కథలు పోస్టు చేయలేకపోతున్నాను.

    ReplyDelete
  4. బాగుంది. మంచి భావోద్వేగం .. అందుకు తగిన పదసంపద. భేష్!

    ReplyDelete
  5. మీ బ్లాగు చదవడం ఆనందమనిపించింది

    అభినందనలు

    ReplyDelete
  6. Himajagarki,
    dhanyavadalu. migilina amsaalu kuda chadivi me abhiprayam cheppandi.

    ReplyDelete
  7. Kanumuri varki,
    Na blog loki meku
    Hrudayapurvaka swagatam. Miru kuda anni vishayalapai abhiprayam telupagortanu.

    ReplyDelete