Wednesday, June 9, 2010

జీవన చిత్రం


దరికి చేరలేను..
దూరమవ్వలేను.

మాటలాడలేను..
మౌనిని కాలేను.

కనుల నింపలేను..
కనులు మూయలేను.

చింత మానలేను..
చింత బాపలేను.

ప్రీతి పిల్వలేను..
భ్రాంతి వదలలేను.

కోపమాపలేను..
తాపమోపలేను.

మదిని మూయలేను..
మమత నీయలేను.

సుఖము వీడలేను..
బాధ తీర్చలేను.

నిన్ను వీడలేను..
వీడి నేను లేను.
.........................

ఎంత చిత్రమాయె..
నా జీవచిత్రమ్ము!
.........................

ఛిద్రమవును కాదె..
నీవు లేకున్నను....!

4 comments:

  1. చాలా బావుందండి. చిన్న చిన్న వాక్యాల్లో చాలా మంచి అర్ధం చెప్పారు.

    ReplyDelete
  2. chala bagundi the way u render the cycle of words!

    ReplyDelete
  3. మీ కవితలన్ని బాగున్నాయి ఒక విషయండి మీరు word verifivation తీసేస్తే ఇంకా బాగుటుందని నా అభిప్రాయం.

    ReplyDelete